Mobile Popup Ad
Mobile Popup Ad

లవర్ మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్ పై‌నుంచి దూకిన యవతి

కలం, నిజామాబాద్ బ్యూరో : ప్రియుడికి ముందే పెళ్ళయిన విషయం తెలిసి ప్రియురాలు మనస్తాపానికి గురైంది. ఇన్నాళ్ళూ ఆ విషయం దాచి పెట్టి ప్రేమలో ఉన్నాడని తెలిసి తట్టుకోలేక పోయింది. ప్రియుడిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి అదే పీఎస్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ (Balkonda) పోలీస్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం.. బాల్కొండకు చెందిన సాయికుమార్ తో కొన్నాళ్లుగా ఆ యువతి ప్రేమలో ఉంది. అంతకుముందే సాయికుమార్ కు పెళ్లయింది. పెళ్లి విషయం దాచిపెట్టి మోసం చేశాడని యువతి మనస్తాపానికి గురైంది. అతడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఫిర్యాదు చేసిన అనంతరం.. స్టేషన్ భవనం నుంచి కిందికి దూకేసింది. తీవ్రంగా గాయపడిన యువతిని పోలీసులు నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>