Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్ కొరత.. క్యూ లో గంటలతరబడి ‘శవం’!

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ యుధ్దం వల్ల గల్ఫ్ నుంచి ఆయిల్ సరఫరా (Petrol Shortage ) దెబ్బతినడం.. హర్మూజ్ జలసంధిలో రవాణా సమస్యల వల్ల భారత్ తో తీవ్ర ఇంధన కొరత నెలకొంది. దీంతో ఇంధనం కోసం జనం బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ కోసం బంకు వద్ద శవం కూడా గంటల తరబడి ఎదురు చూసింది. ఇది వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినప్పటికీ .. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో నిజంగా జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాజ్‌గంజ్ జిల్లా నిచ్లౌల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న సిధావే గ్రామంలో సర్వేశ్ కసౌధన్ అనే వ్యక్తి మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం శ్మశానానికి తరలిస్తుండగా మధ్యలోనే వాహనంలో పెట్రోల్ అయిపోయింది. దీంతో చేసేదేమీ లేక డ్రైవర్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు వాహనాన్ని తీసుకెళ్లాగా.. అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టి ఉన్నాయి. స్థానికులు, బంధువులు పరిస్థితిని వివరించప్పటికీ, నిబంధనల ప్రకారం.. క్యూలోనే రావాలని చెప్పడంతో దాదాపు రెండు గంటల పాటు వేచి ఉన్నారు. తీరా దగ్గరికి వెళ్లేసరికి స్టాక్ అయిపోయిందంటూ నిర్వహకులు బంకును మూసివేశారు. ఈ ఘటనను అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కనీసం అత్యవసర సేవలు, అంతిమ యాత్ర వాహనాలకైనా ప్రాధాన్యత ఇవ్వలేని స్థితిలో వ్యవస్థలు ఉన్నాయని ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>