epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రహస్య వీడియోలతో బెదిరింపులు.. పోలీసులను సైతం ట్రాప్, కిలేడీ అరెస్ట్

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు మహిళలు మగవాళ్లను ట్రాప్(Extortion Trap) చేయడం, బెదిరింపులకు దిగడం.. లక్షలు దండుకోవడం లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ట్రాప్ చేసి.. లక్షలు దోచుకున్న కొంతమంది మహిళల బాగోతాలు ఇటీవల బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ హయత్ నగర్ పోలీసులు ఓ కిలేడీని అదుపులోకి తీసుకున్నారు. తన కవ్వింపు చర్యలతో మగవాళ్ళను ట్రాప్ చేస్తూ.. బిజినెస్ పేరుతో ముంచేయడం అలవాటుగా మారిందామెకు. అందాలను ఎరగా వేస్తూ.. సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీసేసిది. ఆ తర్వాత బెదిరింపు చర్యలకు దిగేది. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఎంతోమందిని ట్రాప్ చేసి లక్షల్లో దోచుకుంది ఈ కిలేడీ. చివరకు పోలీసులు సైతం ఆ మాయ లేడీకి బలై డిమాండ్ చేసినంతా అందించారు. ఆమె ఖాతాల్లో పోలీసులు సైతం ఉండటంతో పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా పరిధిలోని ఒక పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను రెండో వివాహం చేసుకుంది ఈ లేడీ. అలాగే ఓ కారు డ్రైవర్ ను కూడా మభ్య పెట్టీ అతని వద్ద లక్షలు కాజేసినట్టు పోలీసులు గుర్తించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు.. పోలీస్ అధికారులు కూడా ఈమె ట్రాప్(Extortion Trap) లో పడి లక్షలు పోగొట్టుకున్నారని, వాళ్ళతో ఉన్న సమయంలో రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే మొత్తం ఎనిమిది కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పోలీస్ అధికారులు ధృవీకరించారు.

Read Also: ఢిల్లీ గాలి పీలిస్తే.. ధూమపానం చేసినట్టే!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>