epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నల్లగొండ పంచాయతీ ఎన్నికలు: మహిళా ఓటర్లే గేమ్ చేంజర్స్

కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో తొలి విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహిళా ఓటర్లే (Women voters) అధికంగా ఉండడంతో వారిపైనే పంచాయతీ ఫలితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పాలి. మహిళా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో.. ఆ దిశగా ఫలితం ఉండే చాన్స్ ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ సైతం మహిళా ఓటర్లపై ఎక్కువగా ఫోకస్ చేసింది. అందులో భాగంగానే మహిళలకు అందించిన సంక్షేమ పథకాలనే విస్తృతంగా కాంగ్రెస్ క్యాడర్ తమ ప్రచారం వినియోగించింది. ఈ క్రమంలో మహిళలు ఏం డిసైడ్ చేస్తారో.. ఎటు వైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది.

ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్ల తీర్పే కీలకం..

ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా, తొలి విడత పోలింగ్ గురువారం జరగనుంది. తొలి విడతలో భాగంగా నల్లగొండ జిల్లాలో 318 గ్రామపంచాయతీలు, సూర్యాపేట జిల్లాలో 159, యాదాద్రిభువనగిరి జిల్లాలో 153 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో దాదాపుగా నకిరేకల్, నల్లగొండ, మునుగోడు, ఆలేరు, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. అయితే నకిరేకల్ నియోజకవర్గంలో 2,50,415 ఓట్లు ఉంటే.. అందులో 1,25,919 మంది మహిళా ఓటర్లే. నల్లగొండ నియోజకవర్గంలో 2,45,747 ఓట్లు ఉంటే.. 1,25,718 మహిళా ఓటర్లు, మునుగోడు నియోజకవర్గంలో 2,53,182 ఓట్లు ఉంటే.. 1,26,732 మహిళా ఓటర్లు, ఆలేరు నియోజకవర్గంలో 2,32,961 ఓటర్లు ఉంటే.. 1,16,554 మహిళా ఓటర్లు(Women voters) , సూర్యాపేట నియోజకవర్గంలో 2,42,199 ఓటర్లు ఉంటే.. 1,23,712 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 2,56,642 ఓటర్లు ఉంటే.. 1,28,407 మహిళా ఓటర్లు ఉండడం గమనార్హం. వీరే గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయనుండడం గమనార్హం.

సంక్షేమ పథకాలపైనే ఆశలు

పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలపైనే గంపెడాశలు పెట్టుకుంది. దీనికితోడు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మహిళా ఓటర్ల (Women voters) ప్రాధాన్యతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. రేషన్ కార్డులను సైతం మహిళల పేరు మీద ఇవ్వడం.. ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ చీరలు.. ఇలాంటి పథకాలను ఆసరాగా చేసుకుని మహిళా ఓటు బ్యాంకును క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే.. కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకతను మూట గట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన స్కీములు, కేసీఆర్‌ పేరునే నమ్ముకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.

Read Also: ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>