Mobile Popup Ad
Mobile Popup Ad

మోడీ సభకు జనం రాలేదని విద్యార్థుల తరలింపు.. యువతి వీడియో వైరల్!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) స‌భ‌కు జ‌నం రాక‌పోవ‌డంతో కాలేజీలు, స్కూళ్ల‌కు సెల‌వులు ఇచ్చి మ‌మ్మ‌ల్ని తీసుకొచ్చారంటూ ఓ యువ‌తి చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇటీవ‌ల యూపీలోని నోయిడా (Noida)లో ఓ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్స‌వానికి మోడీ వెళ్లారు. ఈ స‌భ‌కు హాజ‌రైన ఓ విద్యార్థిని ఆస‌క్తిక‌ర వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎండ‌ల తీవ్ర‌త‌తో మోడీ స‌భ‌కు జ‌నం ఎవ‌రూ రాలేద‌ని, దీంతో గల్గోటియాస్ యూనివర్సిటీ (Galgotias University) సహా నోయిడాలోని స్కూళ్లు, కాలేజీల నుంచి విద్యార్థులను తరలించార‌ని వీడియోలో పేర్కొంది.

దీనికి విద్యా సంస్థ‌లు భారీ ఆఫ‌ర్ కూడా ఇచ్చాయ‌ని తెలిపింది. రెండు రోజుల అటెండెన్స్, సెల‌వులు హామీ ఇచ్చి మరీ విద్యార్థుల్ని తీసుకెళ్లిన‌ట్లు వెల్ల‌డించింది. ఖాళీ కుర్చీల్ని నింపడానికి మరో దారి లేక.. ఇలా బలవంతంగా విద్యార్థుల్ని తరలించార‌ని సెటైర్లు వేసింది. ఇంతా చేసి.. మళ్లీ తన ర్యాలీలకు యువత వస్తోందంటూ తెగ ప్రచారం చేసుకుంటున్నార‌ని కామెంట్ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read Also: మావోయిస్టు పార్టీ : 60 ఏళ్ళ ప్రస్థానం.. రెండేళ్లలో పతనం!?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>