కలం, వెబ్ డెస్క్ : భారత దేశం ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్యం (Wild Life) కలిగిన ప్రాంతం. మంచు దుప్పటి పరుచుకున్న హిమాలయ పర్వతాల నుంచి పశ్చిమ కనుమల్లోని అడవులు, అండమాన్ నికోబార్ దీవుల వరకు విస్తరించిన విభిన్న భౌగోళిక పరిస్థితులు అనేక అరుదైన, స్థానిక జంతుజాతులకు (Rare Animals) అవాసాలుగా మారాయి. ప్రపంచంలో మరెక్కడా కనిపించని జాతులు భారతదేశానికి (India) ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాటిలో కొన్నింటికి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మలబార్ సివెట్
ప్రపంచంలో అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన మలబార్ సివెట్ (Malabar civet) పశ్చిమ కనుమల్లో నివసిస్తుంది. రాత్రిపూట మాత్రమే సంచరించే ఈ పక్షి వేట, అడవుల్లో మనుషుల నివాసాల కారణంగా అరుదుగా కనిపిస్తోంది. కాగా, పరిరక్షణ లేకపోతే మలబార్ సివెట్ జాతీ పూర్తిగా అంతరించే ప్రమాదం లేకపోలేదు.
సింహం తోక మకాక్
సింహం తోక మకాక్ (Lion-Tailed Macaque) అనే అరుదైన కోతి జాతికి చెందిన జంతువు. ముఖం చుట్టూ ఉండే తెలుపు మేనుతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. పశ్చిమ కనుమల అడవుల్లో నివసించే ఈ కోతి జాతీ తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది.
ఊదారంగు కప్ప
పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితమైన మరో ప్రత్యేక జీవి ఊదారంగు కప్ప (Purple Frog). ఈ ఉభయచర జీవి తన జీవితంలో ఎక్కువ కాలం భూగర్భంలోనే ఉంటుంది. వర్షాకాలంలో కొద్ది రోజుల పాటు సంతానోత్పత్తి కోసం బయటకు రావడం దీని ప్రత్యేకత.
భారతీయ పాంగోలిన్
రాత్రిపూజ సంచరించే రహస్య జీవిగా భారతీయ పాంగోలిన్ (Indian Pangolin) పెరొందింది. చీమలు, చెదపురుగులను ఆహరంగా తీసుకుంటుంది. ఈ జంతువు శరీరంపై ఉండే పొలుసుల కోసం వేటగాళ్లు దీన్ని చంపుతుండడంతో ఈ జాతి ప్రమాదంలోకి నెట్టివేయబడింది.
నామ్ డఫా ఎగిరే ఉడుత
అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న నామ్ డఫా జాతీయ ఉధ్యానవనానికి మాత్రమే ఈ జీవి పరితమైంది. పరిమిత ప్రాంతంలో మాత్రమే కనిపించడం వల్ల నామ్ డఫా ఎగిరే ఉడుత (Namdapha Flying Squirrel) గురించి సమాచారం తక్కువగా ఉంటుంది. దీంతో దీని జనభా, ప్రవర్తనపై అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలకు సవాల్ గా మారింది.
కాశ్మీర్ జింక
కాశ్వీర్ లోయకు మాత్రమే చెందిన కాశ్మీర్ జింక (Kashmir Stag) (హంగుల్) ఎర్ర జింకలలో అరుదైన జాతీగా ఉంది. వేట కారణంగా వీటి సంఖ్య గణనీయంగా పడిపోయింది.
నికోబార్ మెగాపోడ్
నికోబాద్ దీవుల్లో మాత్రమే కనిపించే ఈ పక్షి తన గుడ్లను పొదిగేందుకు కుళ్లిపోయిన చెట్లలో దిబ్బలు నిర్మిస్తుంది. నికోబార్ మెగాపోడ్ (Nicobar Megapod) భారతదేశ పక్షి వైవిద్యాన్ని ప్రతిబింబిస్తుంది.
హిమాలయన్ వోల్ఫ్
హిమాలయాల్లోని కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా హిమాలయన్ వోల్ఫ్ (Himalayan Wolf) తోడేలు ఉపజాతిగా గుర్తింపు పొందింది. ఇది అత్యంత జన్యుపరంగా విభిన్నమైన తోడేలు జాతుల్లో హిమాలయన్ వోల్ఫ్ జాతిని ఒకటిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అండమాన్ వైట్ – హెడెడ్ స్టార్లింగ్
అండమాన్ దీవుల్లో మాత్రమే అండమాన్ వైట్ – హెడెడ్ స్టార్లింగ్ (Andaman white Headed Starling) కనిపిస్తుంది. ఈ జీవికి తెల్లటి తల, నల్లటి శరీర రంగుతో పక్షి ప్రేమికులను ఆకర్షిస్తుంది.
పిగ్మి హాగ్
ప్రపంచంలో (Wild Life) జీవ వైవిద్యంలో అతి చిన్న అడవి పందిగా పిగ్మి హాగ్ (Pigmy Hog) పెరొందింది. ఒకప్పుడు అంతరించిపోయిందని భావించగా ప్రస్తుతం అస్సాం గడ్డి భూముల్లో కనిపిస్తోంది. జంతు పరిరక్షణ చర్యల ద్వారా పిగ్మీ హాగ్ జాతిని కాపాడారు.


