కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు (KCR Birthday) సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ప్రజాసేవలో నిమగ్నమవుతూ, రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషిని కొనసాగించాలని, భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని రేవంత్ ఆకాంక్షించారు. ఏపీ మాజీ సీఎం జగన్ కూడా విష్ చేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

1954 ఫిబ్రవరి 17న జన్మించిన కేసీఆర్ (KCR) తెలంగాణ ఆవిర్భావ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 2014లో తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో సాగునీటి, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు అయ్యాయి. దాదాపు తొమ్మిదిన్నర ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

Read Also: సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>