పరకాలలో దారుణం.. కిరాయి వ్యక్తులతో భర్తను చంపించిన భార్య!

క‌లం, వెబ్ డెస్క్‌: హ‌నుమ‌కొండ (Hanumakonda) జిల్లాలోని ప‌ర‌కాల‌ (Parakala)లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్ద‌రు పిల్ల‌లున్న‌ ఓ వివాహిత త‌న ప్రియుడితో క‌లిసి బ‌తికేందుకు క‌ట్టుకున్న భ‌ర్త‌నే చంపించింది. కిరాయి వ్య‌క్తుల‌కు డ‌బ్బులు ఇచ్చి ఈ దారుణానికి పాల్ప‌డింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌ర‌కాల‌కు చెందిన లావ‌ణ్య‌, సుమ‌న్‌ల‌కు 15 ఏళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వీరికి ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. లావ‌ణ్య‌కు మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం ఉంది. ఈ విష‌యం సుమ‌న్‌కు తెలియ‌డంతో దంప‌తులిద్ద‌రికీ త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. దీంతో లావ‌ణ్య ఎలాగైనా భ‌ర్త‌ను వ‌దిలించుకొని ప్రియుడితో సెటిల్ అవ్వాల‌ని ప్లాన్ వేసింది. కిరాయికి హ‌త్య‌లు చేసే ఓ సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడి త‌న భ‌ర్త‌ను చంపేయాల‌ని చెప్పింది. స‌ద‌రు గ్యాంగ్ సుమ‌న్‌ను ఓ నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి బీరు సీసాలతో పొడిచి హత్య చేశారు. ఆ త‌ర్వాత శ‌వాన్ని పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు.

సుమ‌న్ మృతిని నిర్ధారించుకున్న లావ‌ణ్య ఏమీ తెలియ‌న‌ట్టు భ‌ర్త క‌నిపించ‌డం లేద‌ని పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. అయితే లావ‌ణ్య తీరుపై అనుమానం వ‌చ్చిన పోలీసులు త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేప‌ట్టారు. తన భ‌ర్త క‌నిపించ‌కుండా పోవ‌డానికి ముందు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌పై ఆరా తీశారు. ఈ విచార‌ణ‌లో లావ‌ణ్య చివ‌రికి తానే భ‌ర్త‌ను చంపించిన‌ట్లు పోలీసుల ఎదుట అంగీక‌రించింది. ప్రియుడితో కలిసి ఉండడానికే భర్తను చంపించినట్లు చెప్పింది. దీంతో పోలీసులు లావణ్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హ‌త్య‌కు స‌హ‌క‌రించిన సుపారీ గ్యాంగ్ వివ‌రాల‌ కోసం ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read Also: షాకింగ్.. భారీగా పెరిగిన సబ్బుల ధరలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>