మొక్కజొన్న రైతులకు బస్తాల కొరత: ఎర్రబెల్లి దయాకర్ రావు

కలం, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు బస్తాల కొరత తీర్చలేకపోతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) విమర్శించారు. గురువారం పాలకుర్తి (Palakurthi) వ్యవసాయ మార్కెట్ యార్డ్​ను సందర్శించి రైతులతో మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వకపోగా, రైతులు పండించిన పంటలకు మద్దతు ధరకు కొనడం లేదని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. వారం రోజుల నుంచి రైతులు ఎండలో పడిగాపులు కాస్తున్నామని కన్నీరు పెట్టుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలన్నారు.

రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న (Maize) పండితే, సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదన్నారు. మక్కల మద్దతు ధర రూ. 2400 ఉంటే రూ. 1600-1700కే అమ్ముకుని రైతులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, మక్కలు కొనుగోలు వేగవంతం చేసి రైతులని ఆదుకోవాలని ఎర్రబెల్లి (Errabelli Dayakar Rao) డిమాండ్ చేశారు.

Read Also: తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: పొన్నం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>