షాకింగ్.. భారీగా పెరిగిన సబ్బుల ధరలు

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలతో సామాన్యులు సతమతమవుతున్నారు. సామాన్యుల జీవితాలపై ఈ యుద్దం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ యుద్ధం వల్ల హార్మూజ్ జలసంధి లో రవాణాలకు ఆటంకాలు కలగడంతో వస్తువుల దిగుమతి ఖర్చు భారమైంది. ఫలితంగా నిత్యావసర ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (HUL) తాజాగా సబ్బులను ధరల (Soap Prices )ను పెంచేసింది. ముడి సరుకు ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో పెంపు చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది.

దీంతో లిరిల్, పియర్స్, డవ్ వంటి సబ్బుల ధరలు (Soap Prices) రెండు నుంచి మూడు రూపాయల వరకు పెరిగాయి. తాజా ధరల సవరణతో లిరిల్ 100 గ్రాముల బార్ రూ. 41కి చేరగా.. పియర్స్ రూ. 32, డవ్ సీరమ్ సోప్ రూ. 60, డవ్ పింక్ సోప్ రూ.70కి పెరిగింది. సబ్బులతో పాటు సర్ఫ్, రెడ్ లేబుల్ వంటి ఇతర ఉత్పత్తుల్లో కూడా ధరలు పెరిగాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయి. సముద్ర మార్గాల్లో రవాణా అడ్డంకులు ఉండడం వల్ల వస్తువుల సరఫరా ఆలస్యమవుతోంది. తమ నిర్వహణ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి కంపెనీలు ధరలను పెంచాల్సి వస్తుంది. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న కాలంలో మరిన్ని వస్తువుల రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది.

Read Also: స్పృహ త‌ప్పిన‌ ఉద్యోగి.. ఫుట్‌ఫాత్‌పై ప‌డేసిన పీవీఆర్ యాజ‌మాన్యం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>