epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ప్రియుడి మోజులో భార్య.. భర్తను హత్యకు సుపారీ

కలం, వెబ్​ డెస్క్​ : సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను భార్యలే కాటికి (Wife Kills Husband) పంపిస్తున్నారు. ఇలాంటి ఘటనే నిజమాబాద్​ (Nizamabad) జిల్లా బోర్గాంలో చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడిన సౌమ్య అనే మహిళ తన భర్తను చంపాలనుకుంది. దీని కోసం ఏకంగా సుపారీ గ్యాంగ్​ కు రూ.35 వేలు ఇచ్చింది.

అయితే, డబ్బులు తీసుకున్నాక సుపారీ గ్యాంగ్​ సౌమ్య ఫోన్ లిఫ్ట్​ చేయలేదు. దీంతో తన ప్రియుడు దిలీప్​ తో కలిసి ఇంట్లో నిద్రపోతున్న భర్తను గొంతు నులిమి హత్య చేసింది. రమేశ్​ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సౌమ్య, దిలీప్​ తో పాటు సుపారీ గ్యాంగును పోలీసులు అరెస్టు చేసి విచారించగా నిందితులు అసలు నిజాలు ఒప్పుకున్నారు. Wife Kills Husband ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>