కలం, వెబ్ డెస్క్ : అందాల రాశీఖన్నా.. అనతి కాలంలోనే టాలెంటెడ్ హీరోయిన్ అనిపించుకుంది. భారీ సినిమాలు, క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంది కానీ.. ఎందుకనో రావాల్సినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. గత కొన్నిరోజులుగా రాశీఖన్నా (Raashii Khanna) అనగనగా ఒక రాజు సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. దీంతో రాశీ నిజంగానే ఐటం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందా..? అవకాశాలు లేక ఇలా ఐటెం సాంగ్ చేస్తోందా అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు రాజు గారికి రాశీ షాక్ ఇచ్చిందని టాక్ వినిపిస్తుంది.
రాశీ ఖన్నా.. ముందుగా ఐటం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పి లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యిందట. షూటింగ్ కి వెళ్లే సమయంలో తాను ఈ పాట చెయ్యను అని మేకర్స్ కి చెప్పిందట. దీంతో షూటింగ్ రెండు రోజులు పాటు ఆగిపోయిందని సమాచారం. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్నారు. ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ మూవీకి మరింతగా గ్లామర్ అట్రాక్షన్ కోసం ఐటం సాంగ్ ప్లాన్ చేశారు. రాశీఖన్నాను (Raashii Khanna) కాంటాక్ట్ చేస్తే.. ముందుగా ఓకే చెప్పి ఆతర్వాత లాస్ట్ మినిట్ లో నో చెప్పిందని తెలిసింది.
ఇంతకీ.. ఎందుకు నో చెప్పిందంటే.. ఐటం సాంగ్ చేస్తే.. ఆతర్వాత అలాంటి ఆఫర్సే వస్తాయనే ఉద్దేశ్యంతో నో చెప్పిందట. దీంతో ఇప్పుడు మరో హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించే పనిలో ఉన్నారట. రాశీఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జంటగా నటించింది. ఈ సినిమాపై రాశీ చాలా ఆశలు పెట్టుకుంది. సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇలాంటి పెద్ద సినిమా చేతిలో ఉండగా.. ఐటం సాంగ్ చేయడం ఎందుకు అనుకుందేమో. మరి.. రాశీ నో చెప్పిన ఆఫర్ కి ఎవరు ఎస్ చెబుతారో చూడాలి.


