విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చింది: TPCC చీఫ్

కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చిందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లోని బోయినపల్లిలో జరిగిన ఛత్రోంకి గూంజ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగ, విద్యా పోటీ పరీక్షల పేపర్లను లీక్ చేస్తూ విద్యార్థులు, యువత జీవితాలతో కేంద్రం చెలగాటం అడ్డుతోందని మండిపడ్డారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయడం లేదని అన్నారు.

దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైనా కేంద్రం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. అందుకే ఈ ఉద్యమంతో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ కన్వీనర్, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>