Mobile Popup Ad
Mobile Popup Ad

పేదల ఇండ్లు కూల్చి ఏం సాధిస్తారు : రామచందర్ రావు

కలం, డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చి ఏం సాధిస్తుందని బీజపీ తెలంగాణ చీఫ్‌ రాంచందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. ఖమ్మం శివారు వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో కూల్చిన ఇండ్లను బీజేపీ నేతలతో కలిసి రామచందర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూదాన్ భూముల్లో (Bhoodan Lands) నివాసం ఉంటున్న వారికి కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని మండిపడ్డారు. భూదాన్ బోర్డు పట్టాలున్న పేదల ఇండ్లను కూల్చేశారు.

ఇది అసలు ప్రజా ప్రభుత్వమే కాదు. పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. బాధితుల తరఫున బీజేపీ పోరాడుతుంది. ఇండ్లు కూల్చిన చోటే వంద గజాల్లో కొత్త ఇండ్లను కట్టి ఇవ్వాలి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుపుతాం’ అంటూ బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు (Ramchander Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: ఏజెన్సీ నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం : మంత్రి పొంగులేటి

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>