Mobile Popup Ad
Mobile Popup Ad

భర్తను మద్యం మాన్పించేందుకు కొట్టిన భార్య.. చివరకు దారుణం

కలం, వెబ్ డెస్క్ : భర్తను మద్యం మాన్పించాలనుకున్న భార్యకు అనుకోని షాక్ తగిలింది. భర్తను కొడితే మానుతాడనుకుని ఆమె కొట్టింది. కానీ చివరకు దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు (Guntur) రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన తిరుపతమ్మతో వెంకటేశ్వర రావుకు పెళ్లి అయింది. ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటున్నారు. అయితే వెంకటేశ్వర రావు రోజూ మద్యం తాగుతూ ఇంట్లో గొడవ చేస్తున్నాడు. పనికి వెళ్లడం మానేశాడు. భర్త వేధింపులు తట్టుకోలేక తన పుట్టింటి వాళ్లకు, బంధువులకు చెప్పింది.

తన భర్తను ఎలాగోలా మార్చాలని.. తిట్టినా, కొట్టినా సరే అని చెప్పింది. తిరుపతమ్మ పుట్టింటి వారు, బంధువులు రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చారు. వెంకటేశ్వర రావుకు మద్యం తాగొద్దని చెప్పారు. కానీ అతను వినకుండా వారితో గొడవకు దిగాడు. వెంకటేశ్వర రావును మార్చాలంటే నాలుగు తగిలించాలని భార్య, బంధువులు డిసైడ్ అయ్యారు. అందరూ కలిసి అతన్ని కొట్టారు. కానీ తగలరాని చోట దెబ్బలు తగలడంతో వెంకటేశ్వరరావు చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య, బంధువులను అరెస్ట్ చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>