Mobile Popup Ad
Mobile Popup Ad

మాజీ డీజీపీ మనుమరాలికి టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా

కలం, వెబ్ డెస్క్: పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఉన్నతాధికారులు అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరాలకు (Cyber Fraud) చెక్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్‌ (Hyderabad)లో సైబర్ నేరగాళ్లు మరో భారీ దోపిడీకి పాల్పడ్డారు. 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న మాజీ డీజీపీ మనుమరాలు దొడ్ల దివ్యారెడ్డి పేరుతో ఆమె అకౌంటెంట్‌ను మోసగించి ఏకంగా రూ.1.20 కోట్లు కొల్లగొట్టారు. దివ్యారెడ్డి ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్న దుండగులు, తానే దివ్యారెడ్డిని అని నమ్మించి అకౌంటెంట్‌కు మెసేజ్ పంపారు.

తాను ప్రస్తుతం ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నానని, అత్యవసరంగా తాను చెప్పిన ఖాతాకు డబ్బులు బదిలీ చేయాలని ఆదేశించారు. అది నిజమని నమ్మిన అకౌంటెంట్ వెంటనే సదరు ఖాతాకు రూ.1.20 కోట్లు పంపారు. అనంతరం అది సైబర్ నేరగాళ్ల పని అని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>