కలం, స్పోర్ట్స్: అల్జీరియాపై హ్యాట్రిక్‌తో అర్జెంటీనాకు ఘన విజయం అందించిన లియోనెల్ మెస్సీ (Lionel Messi), మ్యాచ్‌లో గోల్ చేసిన వెంటనే కంటతడి పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. వరల్డ్ కప్ 2026లో అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గ్రూప్-జేలో జరిగిన ఈ మ్యాచ్‌లో మెస్సీ మూడు గోల్స్ చేసి అర్జెంటీనాను 3-0తో గెలిపించాడు. ఇదే సమయంలో వరల్డ్ కప్ చరిత్రలో (FIFA World Cup) అత్యధిక గోల్స్ రికార్డును మిరోస్లావ్ క్లోజేతో సమం చేశాడు. అలాగే వరల్డ్ కప్‌లో తన తొలి హ్యాట్రిక్‌ను కూడా నమోదు చేశాడు.
అయితే తొలి గోల్ చేసిన తర్వాత మెస్సీ (Lionel Messi) భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం దీనిపై స్పందించిన అతడు, ఇటీవల కొన్ని కఠినమైన రోజులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ఆ బాధకు ఫుట్‌బాల్‌తో ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తిగతంగా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్న కారణంగానే భావోద్వేగానికి లోనైనట్లు వివరించాడు. ఆ సమయంలో తనకు అర్జెంటీనా జట్టు సభ్యులు, సహచర ఆటగాళ్లు ఎంతో అండగా నిలిచారని మెస్సీ కృతజ్ఞతలు తెలిపాడు. తాను బాగుండేలా అందరూ ప్రయత్నించారని చెప్పాడు.
తన కెరీర్‌లో ప్రస్తుతం అనుభవిస్తున్న దశను ప్రత్యేకంగా భావిస్తున్నట్లు కూడా మెస్సీ పేర్కొన్నాడు. ఇప్పటివరకు సాధించిన విజయాలు, ఎదురైన అనుభవాల తర్వాత ఈ సమయం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని తెలిపాడు. జట్టుతో గడుపుతున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. మరోవైపు అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని కూడా మెస్సీ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. మెస్సీ గురించి చెప్పడానికి మాటలు సరిపోవని, అతడు అసాధారణ ఆటగాడని పేర్కొన్నాడు.
Read Also: ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేస్తున్న నిఖిల్ చౌదరి ఎవరు?
Follow Us On: X(Twitter)

