కలం వెబ్ డెస్క్ : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh).. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో (Vijay Sethupathi) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూరి చాలా స్పీడుగా సినిమాని తెరకెక్కిస్తారు. ఈ సినిమాని కూడా తనదైన స్టైల్ లో చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశాడు. ఈ పాన్ ఇండియా మూవీకి స్లమ్ డాగ్ అనే టైటిల్ పెట్టారని వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంత వరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. గత సంవత్సరమే చెన్నైలో గ్రాండ్ గా ఈ సినిమా టైటిల్ ప్రకటించాలి అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. ఆతర్వాత ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు.
కొత్త సంవత్సరంలో చాలా సినిమాల అప్ డేట్స్ వచ్చాయి. ఊహించిన సినిమాల అప్ డేట్స్.. అస్సలు ఊహించని సినిమాల అప్ డేట్స్ చాలా వచ్చాయి కానీ, పూరి నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ రాలేదు. షూటింగ్ ఎప్పుడో అయిపోయింది.. ఏదోక అప్ డేట్ ఇవ్వచ్చు కానీ.. ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కారణం ఏంటంటే.. ఓటీటీ డీల్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. ఇంకా డీల్ క్లోజ్ కాలేదట. ఈ ఇయర్ లో రిలీజ్ స్లాట్లు కూడా టైట్ గా ఉన్నాయి. సంక్రాంతి నుంచి డిసెంబర్ వరకు చాలా మంది నిర్మాతలు ముందే లాక్ చేసుకున్నారు.
పూరి నుంచి వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. అందుచేత పూరి ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాల్సిన పరిస్థితి. పూరి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలి.. మళ్లీ ఫామ్ లోకి రావాలనే కసితో ఉన్నాడు. అందుచేత రిలీజ్ విషయంలో తొందరపడకుండా.. మంచి డేట్ లాక్ చేసుకోవాలని చూస్తున్నాడట. రిలీజ్ డేట్ లాక్ అయితే.. దాని ప్రకారం ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనేది ప్లాన్. అందుకనే న్యూయర్ కి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు అనేది ఇన్ సైడ్ న్యూస్.

Read Also: మా ఫ్యామిలీ అంతా నాన్ వెజ్.. నేను పక్కా వెజిటేరియన్ : జెనీలియా
Follow Us On: Instagram


