కలం వెబ్ డెస్క్ : ఇటీవల హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై (YouTuber Anvesh) ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన అన్వేష్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్‌పై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా అన్వేష్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది.
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగంటి రాజు నేత, హైకోర్టు అడ్వకేట్ రాము, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ ఫిర్యాదు చేశారు. అన్వేష్ విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా అన్వేషణ యూట్యూబ్ ఛానెల్, అన్వేష్ సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పంజాగుట్టలో అన్వేష్‌పై నమోదైన కేసులో దర్యాప్తు మొదలైంది. అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలు కోరుతూ పంజాగుట్ట పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాశారు. దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Read Also: పూరి, విజయ్ సేతుపతి మూవీ ఏమైంది..?
Follow Us On: Pinterest


