Mobile Popup Ad
Mobile Popup Ad

బక్రీద్ పండుగ మానవత్వానికి ప్రతీక: మంత్రి వాకిటి శ్రీహరి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: సమాజంలో మానవత్వానికి ప్రతీకగా నిలిచేది బక్రీద్ పండుగ అని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య శాఖ, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) పేర్కొన్నారు. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ (Makthal) లోని ఈద్గా వద్ద బక్రీద్ ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సేవాభావం, మానవత్వానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందిస్తుందని ఆయన అన్నారు.

ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్య వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నిండాలని, రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు మంత్రి (Vakiti Srihari) తెలిపారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

Read Also: మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. సిద్ధరామయ్య భావోద్వేగ వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>