గ్రామ నిధుల దుర్వినియోగం.. కలెక్టర్‌కు బాధనకుర్తి గ్రామస్తుల ఫిర్యాదు!

కలం, నిర్మల్: ఖానాపూర్ మండలం బాధనకుర్తి (Badankurthy) గ్రామంలో గ్రామ సర్పంచ్, కార్యదర్శి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు ఫిర్యాదు చేశారు.

గ్రామంలో ఎఫ్‌ఎఫ్‌ఎఫ్, టీఎఫ్‌సీ నిధులను పక్కదారి పట్టించారని, ఎలాంటి పనులు చేపట్టకుండానే రూ.19,500 నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై రికార్డులను పరిశీలించి, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత గ్రామ సర్పంచ్, కార్యదర్శిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>