ఉద్యోగుల సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు

కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ల విషయంలో సుప్రీం కోర్టు (Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏ కారణంతో అయినా అరెస్ట్ అయి, 48 గంటలకు మించి జైల్లో ఉంటే.. ఆ ఉద్యోగి సస్పెండ్ అయినట్లేనని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చినా, ఇవ్వకపోయినా.. సస్పెండ్ అయినట్లుగానే భావించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే, కేసు తీవ్రత అధికంగా ఉండి.. నేర చరిత్ర లేకపోతే బెయిల్ ఇవ్వొచ్చని కూడా వివరించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్ విషయంలో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.

కేసు నేపథ్యం ఇదే..

బీహార్ లోని సమస్తిపూర్ గవర్నమెంట్ మెడికల్ ఆసుపత్రిలో పని చేసే ఒక ఉద్యోగి రూ. 4 వేలు లంచం తీసుకుంటూ.. పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో ఆయన అరెస్ట్ అయి.. 15 రోజులు జైల్లో ఉన్నారు. కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను పాట్నా హైకోర్టు రద్దు చేయగా.. సదరు ఉద్యోగి సుప్రీం కోర్టు (Supreme Court)లో సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా, తిరిగి అదే ఆసుపత్రిలో పోస్టింగ్ కూడా ఇవ్వడంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌కు సంబంధించి కీలక తీర్పు ఆదేశాలు ఇవ్వడంతో పాటు బీహార్ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది.

Also Read : కోహ్లీని చూసి కోచ్‌లే భయపడేవాళ్లు: టెన్ డోషాట్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>