Mobile Popup Ad
Mobile Popup Ad

యుద్ధానికి తాత్కాలిక బ్రేక్?.. ఇరాన్ బిగ్ ట్విస్ట్..!

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఎండ్ కార్డు పడే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ మేరకు ఇరాన్ (Iran), అమెరికా(US) మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధం ముగింపు కోసం పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ .. ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

‘‘ఇస్లామాబాద్ ఒప్పందం’’గా దీనికి పేరు పెట్టినట్లు యాక్సియోస్ నివేదించింది. ఒప్పందంలో భాగంగా 45 రోజుల కాల్పుల విరమణను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్‌ 5న (ఆదివారం) 48 గంటల్లో హర్మూజ్‌ తెరవాలని లేకపోతే దాడులతో విరుచుకుపడతామని బెదిరించిన డొనాల్డ్ ట్రంప్.. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చ జరుగుతున్న వేళ ఆ డెడ్ లైన్ ను మరో రోజు పొడిగించినట్లు తెలుస్తోంది. ట్రంప్ కొత్త డెడ్‌లైన్ ప్రకారం GMT బుధవారం ఉదయం 12 గంటల వరకు డెడ్‌లైన్ పొడిగించినట్లు సమాచారం అందుతోంది.

ఇదిలాఉంటే కాల్పుల విరమణ ఒప్పందం పై ఇరాన్ స్పందించింది. తాత్కాలిక సంధి కోసం హార్ముజ్ తెరిచేది లేదని ఇరాన్ (Iran) మధ్యవర్తులకు స్పష్టం చేసింది. తమకు తాత్కాలిక ఒప్పందం కుదరదని.. పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ఆపే శాంతి ఒప్పందం ఉండాలని మధ్యవర్తులకు ఇరాన్ తెలిపినట్లు ఓ ప్రచారం జరుగుతోంది.

Read Also: మామిడిపండ్లలో ఖరీదైన వెరైటీ తెలుసా? కిలో ధర ఎంతో వింటే షాక్ అవ్వాల్సిందే !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>