కలం, వెబ్ డెస్క్: అల్లు వారి ఇంట పెళ్లి సందడి షురూ అయ్యింది. టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish), నయనికతో త్వరలో ఏడడుగులు వేయబోతున్నారు. శుక్రవారం నిర్వహించిన పసుపు దంచే వేడుకలో అటు మెగా, ఇటు అల్లు కుటుంబ సభ్యులు సందడి చేశారు. అల్లు అరవింద్ దంపతులు ఈ వేడుకను దగ్గరుండి పర్యవేక్షించగా, ఇంటి ఆడపడుచుల సందడితో పెళ్లికళ సంతరించుకుంది. ఈ పసుపు దంచే వేడుకలో ఇరు కుటుంబ సభ్యులంతా ఒకేచోట చేరి సందడి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, ఐకాన్ స్టార్ సతీమణి స్నేహారెడ్డితో పాటు చిరంజీవి కుమార్తె సుస్మిత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. పసుపు దంచుతూ, పాటలు పాడుతూ పెళ్లి కుమారుడిని చేసే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే అల్లు శిరీష్-నయనిక (Allu Sirish – Nayanika) పెళ్లికి ఓ ప్రత్యేకత ఉంది. మార్చి 6న హైదరాబాద్‌లో వీరి వివాహం జరగనుండగా, అదే రోజున అల్లు అర్జున్-స్నేహారెడ్డిల పెళ్లిరోజు (Marriage Day) కావడంతో మరింత సందడి నెలకొనబోతోంది.
Read Also: కవలపిల్లల పేర్లు చెప్పిన రామ్ చరణ్
Follow Us On : WhatsApp


