epaper
Wednesday, February 18, 2026
epaper

రీ కౌంటింగ్ కు డిమాండ్​ చేస్తూ ధర్నా.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్​

కలం, వరంగల్ బ్యూరో : వర్దన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ (Aroori Ramesh) ను పోలీసులు అరెస్ట్​ చేశారు. వర్ధన్నపేట మున్సిపల్​ ఎన్నికల కౌంటింగ్​ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్​ఎస్​ ధర్నా నిర్వహించింది. పోలీసులను తోసుకుంటై కౌంటింగ్​ కేంద్రంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వరంగల్, ఖమ్మం హైవే పై పార్టీ శ్రేణులతో కలిసి ఆరూరి ధర్నాకు దిగారు.

మున్సిపాలిటీ (Wardhannapet Municipality) ఎన్నికల్లో 12 వ వార్డు కు చెందిన తమ అభ్యర్థి గెలిచినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి నిర్ణయాన్ని అయన తప్పుబట్టారు. వెంటనే అధికారిని సస్పెండ్ చేసి 12 వ వార్డు ఫలితాన్ని తెల్చేందుకు రీ కౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో శాంతిభద్రతలను కాపాడేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆరూరి రమేశ్​ ను (Aroori Ramesh) అరెస్ట్​ చేశారు. దీంతో బీఆర్ఎస్​ కార్యకర్తలు నిరసన విరమించారు.

Read Also: దెబ్బకు దెబ్బ కొట్టిన నవీన్ యాదవ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>