కేటీఆర్‌కు ప్రాజెక్టుల గురించి తెలియదు: ఎమ్మెల్యే మేఘారెడ్డి

కలం, వనపర్తి: ప్రాజెక్టులు ఎక్కడున్నాయో కూడా తెలియని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులపై అప్పటి సీఎం కేసీఆర్‌ ఎన్నిసార్లు సమీక్షలు చేశారని ప్రశ్నించారు. కృష్ణా బేసిన్‌కు నష్టం జరిగేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. రాయలసీమకు నీటి ప్రయోజనాలపై జరిగిన చర్చల సమయంలో కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్‌ను హైదరాబాద్‌కు పిలిచి బిర్యానీ పెట్టి బేసిన్లు, బేషజాలు లేవని చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ..

ఎల్‌నినో (El Nino) ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు ముందుగానే సూచించామని ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) తెలిపారు. ఇన్‌ఫ్లో లేకపోవడంతోనే మోటార్లు నిలిపివేశామని చెప్పారు. ఏడు రోజుల్లోనే 4.5 టీఎంసీల నీటిని నింపామని.. జూరాల ప్రాజెక్టుకు నీటి లభ్యత కోసం మూడు రోజుల కిందటే కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. ‘కారు ఇప్పటికే ముక్కలైంది.. తలా ఒక ముక్క తీసుకుని వెళ్లారు’ అంటూ బీఆర్‌ఎస్‌పై మేఘారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read : విద్యార్థులకు టిఫిన్.. సిద్ధమైన సీఎం బ్రేక్‌ ఫాస్ట్ కిచెన్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>