మదర్సాలో బాలుడిపై లైంగిక వేధింపులు.. మౌల్సాబ్‌పై పోక్సో కేసు!

కలాం వెబ్ డెస్క్ : హైదరాబాద్ పాతబస్తీలో బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. మదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మగూడ ఫాతిమా మసీదు మదర్సాలో (Madrasa) ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మదర్సాలో చదువుకుంటున్న 11 ఏళ్ల బాలుడి (11-Year-Old Boy) పట్ల అక్కడి మౌల్సాబ్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.

బాలుడి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు తన మొబైల్ ఫోన్‌లో బాలుడికి అశ్లీల వీడియోలు చూపించి, అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ బాలుడిని బెదిరించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లి తీవ్ర ఆందోళనకు గురై మదన్నపేట పోలీసులను ఆశ్రయించారు.

ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో (POCSO) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, బాధిత బాలుడి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అధికారులు భరోసా కేంద్రానికి పంపించారు. బాలుడికి అవసరమైన సహాయం అందించడంతో పాటు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read : ప్రాణాలకు తెగించి రక్షణ చర్యలు.. సిబ్బందికి సీఎం రేవంత్ అభినందనలు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>