బెంగళూరు మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పింక్ లైన్‌కు గ్రీన్ సిగ్నల్!

కలం, వెబ్ డెస్క్: బెంగళూరు మెట్రో (Bengaluru Metro) పింక్ లైన్‌లోని 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గం నవంబర్ 13 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నూతన మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న నిర్వహణ అనుమతులు లభించడంతో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఆరు రైళ్లను సిద్ధం చేసింది. ఈ మార్గానికి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి కూడా అవసరమైన భద్రతా అనుమతులు లభించాయి.

మొత్తం 21.26 కిలోమీటర్ల పొడవైన పింక్ లైన్‌లో 13.76 కిలోమీటర్లు భూగర్భ మార్గం కాగా, 7.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గం. కలేనా అగ్రహార నుంచి తవరకెరె వరకు నిర్మాణ పనులు పూర్తవడంతో ఆరు ప్రధాన స్టేషన్ల ద్వారా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే బన్నెరఘట్ట రోడ్, ఐఐఎంబీ, జేపీనగర్, జయదేవ హాస్పిటల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయాణం సులభమవుతుంది. ముఖ్యంగా దక్షిణ బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణ సమయం ఆదా కానుంది.

Also Read : రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>