40 ఏళ్ల కాంగ్రెస్ బంధానికి ముగింపు.. గులాబీ గూటికి సీనియర్ నేత!

కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ కార్యకర్త పానుగంటి రాము (Panuganti Ramu) తన అనుచరులతో కలిసి మంగళవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాను, పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పానుగంటి రాము మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ గతంలో పాదయాత్ర చేసి మొక్కులు తీర్చుకున్నానని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు మెరుగైన పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, యూరియా కొరత, విద్యుత్ సమస్యలు, ధాన్యానికి గిట్టుబాటు ధర, బోనస్ వంటి అంశాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ తమలాంటి పాత కార్యకర్తలను విస్మరించి, తర్వాత వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం బాధ కలిగించిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిరంజన్‌రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమనే నమ్మకంతో బీఆర్ఎస్‌లో చేరినట్లు వెల్లడించారు. పానుగంటి రాముతో పాటు గోర్ల రాము, కొమ్ము నాగయ్య, గార్ల రాము, కురుమయ్య, భగవంతు, నరేష్, అభిషేక్, చరణ్ తదితరులు బీఆర్ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, మాణిక్యం, ధర్మానాయక్, మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, ధర్మశాస్త్రి, భగవంతు యాదవ్, శంశుద్దీన్, అంజి, సత్యనారాయణ చారి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>