Mobile Popup Ad
Mobile Popup Ad

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కీలక సమీక్ష .. ఆదేశాలు జారీ

కలం, వనపర్తి: సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో వనపర్తి (Wanaparthy) జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) SIR పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటరు జాబితాల ఖచ్చితత్వం కోసం చేపట్టనున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అత్యంత కీలకమైందని తెలిపారు. ముఖ్యంగా డబుల్ ఓట్లను గుర్తించి తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఇటువంటి అపోహలు లేకుండా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఎన్యుమరేషన్ ఫారాలను తప్పనిసరిగా పూరించే విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేసేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి అర్హుడైన ఓటరు ఈ ప్రక్రియలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

అలాగే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్‌పై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు జిల్లా కేంద్రంలో ఈ నెల 23వ తేదీన 2కే రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వనపర్తి బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమయ్యే ఈ 2కే రన్ విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్య ప్రకాష్, జెడ్పి సీఈవో యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్

అంతకుముందు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్య ప్రకాష్, జెడ్పి సీఈవో యాదయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు.   ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కాగా, నేటి ప్రజావాణి కార్యక్రమంలో 77 దరఖాస్తులు వచ్చాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>