Mobile Popup Ad
Mobile Popup Ad

ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్ కలకలం.. కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధితులు

కలం, కరీంనగర్ బ్యూరో: కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందడంతో పాటు కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందారంటూ ఓ మహిళపై ఆమె సోదరీమణులు సోమవారం కరీంనగర్ (Karimnagar) జిల్లా కలెక్టర్‌ చిత్ర మిశ్రాకు  ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. ప్రభుత్వ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్‌లో కుక్‌గా పనిచేసిన మునిగంటి ఐలయ్య 2018 ఫిబ్రవరి 28న విధుల్లో ఉండగానే మృతి చెందారు. అనంతరం రావాల్సిన కారుణ్య ఉద్యోగం, ఆర్థిక ప్రయోజనాలు, ఇతర ప్రభుత్వ బెనిఫిట్ల విషయంలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా తమ సోదరి మునిగంటి స్వాతి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందినట్లు పేర్కొన్నారు.

తమ సమ్మతి లేకుండానే, తమ పేర్లపై దొంగ సంతకాలు చేసి ధృవీకరణ పత్రం పొందారని ఆరోపించారు. ఆ సర్టిఫికెట్ ఆధారంగా కారుణ్య నియామకంతో ప్రభుత్వ ఉద్యోగం పొందడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందినట్లు తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నించగా తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఎక్కడ ఫిర్యాదు చేసినా ఏమీ కాదంటూ దురుసుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టి, సంబంధిత దరఖాస్తులు, అఫిడవిట్లు, సంతకాలు, రికార్డులను పరిశీలించాలని కలెక్టర్‌ను కోరారు.

దర్యాప్తులో దొంగ సంతకాలు లేదా తప్పుడు సమాచారం ఆధారంగా ధృవీకరణ పత్రం పొందినట్లు తేలితే బాధ్యులపై, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ, సంబంధిత రికార్డులు, సంతకాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయాలని సూచించినట్లు తెలిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>