కలం, వెబ్ డెస్క్: భారత చెస్ దిగ్గజం, మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు ప్రతిష్టాత్మక ఎస్‌జేఎఫ్‌ఐ మెడల్ 2024 ప్రకటించారు. ఈ అవార్డును స్వీకరించేందుకు ఆనంద్ అంగీకరించినట్లు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ కార్యక్రమం జూన్ 24న చెన్నైలో ఘనంగా జరగనుంది. ఎస్‌జేఎఫ్‌ఐ కార్యదర్శి రమేష్ వారికుప్పల తెలిపిన వివరాల ప్రకారం, అవార్డు ప్రదానోత్సవంలో ప్రముఖ అతిథులు, క్రీడా ప్రముఖులు, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టులు, క్రీడా రంగానికి చెందిన పలువురు పాల్గొననున్నారు. భారత క్రీడా రంగానికి విశ్వనాథన్ ఆనంద్ చేసిన సేవలు ఎంతో గొప్పవని ఎస్‌జేఎఫ్‌ఐ పేర్కొంది.
చెస్ ప్రపంచంలో ఆయన సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని, ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని వెల్లడించింది. ఇలాంటి దిగ్గజ క్రీడాకారుడికి ఎస్‌జేఎఫ్‌ఐ మెడల్ 2024 అందించడం తమకు గౌరవంగా భావిస్తున్నట్లు రమేష్ వారికుప్పల తెలిపారు. ఈ అవార్డు కార్యక్రమాన్ని గర్వంగా నిర్వహించేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. చెస్ క్రీడలో విశ్వనాథన్ ఆనంద్ సాధించిన విజయాలు భారత క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. ఇప్పుడు ఆయనకు లభిస్తున్న ఈ గౌరవం మరో ముఖ్యమైన గుర్తింపుగా భావిస్తున్నారు.

