సత్తుపల్లిలో MSF కమిటీల ఏర్పాటు.. అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక

కలం, సత్తుపల్లి: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు స్థానిక సత్తుపల్లి (Sathupally) మండల పరిధిలోని గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) కమిటీలను ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు విద్యార్థులను కమిటీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. సిద్ధారం గ్రామ ఎంఎస్ఎఫ్ కమిటీ అధ్యక్షుడిగా గంధం రామకృష్ణ మాదిగ, ఉపాధ్యక్షుడిగా సింగపోగు రామకృష్ణ మాదిగ ఎన్నికయ్యారు.

నారాయణపురం ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు దొడ్డ మధు మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన కమిటీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కుల్లేమిల్లి వంశీ మాదిగ, ఉపాధ్యక్షుడిగా వేల్పుల నాగరాజు మాదిగ ఎంపికయ్యారు. సత్తుపల్లిలోని గాయత్రి కళాశాల ఎంఎస్ఎఫ్ కమిటీ అధ్యక్షుడిగా బి. మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడిగా బి. దీపక్ ఎన్నికయ్యారు. నారాయణ కళాశాల కమిటీ అధ్యక్షుడిగా సిహెచ్. కార్తీక్, ఉపాధ్యక్షుడిగా ఎస్. సంపత్, విశ్వశాంతి పాఠశాల కమిటీ అధ్యక్షుడిగా జి. రిషిక్, ఉపాధ్యక్షుడిగా సాయి సాత్విక్ ఎంపికయ్యారు.

కాకతీయ కళాశాల కమిటీ అధ్యక్షుడిగా మిద్దె రాకేష్, ఉపాధ్యక్షుడిగా హర్షిత్, విద్యాభారతి కళాశాల కమిటీ అధ్యక్షుడిగా కె. అభిరామ్, ఉపాధ్యక్షుడిగా పి. సతీష్ ఎన్నికయ్యారు. గ్రామాల్లోని మాదిగ విద్యార్థులను ఐక్యం చేయడం, వారి ఉన్నత విద్యకు అవసరమైన సహకారం అందించడం ఈ కమిటీల ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులకు దూరం కాకుండా, ఉన్నత విద్యను కొనసాగించేలా కృషి చేయాలని సూచించారు.

ఎంఎస్ఎఫ్ ద్వారా ఎన్నికైన విద్యార్థులు భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు తమ వంతు సహకారం అందించాలని, ఇతర విద్యార్థులు కూడా తమ హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. చిన్న వయస్సు నుంచే చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్యపై దృష్టి సారించాలని, ప్రతి ఒక్కరూ తమకున్న విద్యా హక్కులను సంపూర్ణంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఉన్నత స్థానాలకు ఎదగడానికి విద్య ఒక్కటే మార్గమని, చదువుతోనే చైతన్యం, సాధికారత సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గోలమూడి శ్రీనివాసరావు మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ సత్తుపల్లి మండల అధ్యక్షుడు గద్దల దేవయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ సత్తుపల్లి మండల ప్రధాన కార్యదర్శి పరిగడుపు లక్ష్మణ్ మాదిగ, జాన్ మాదిగ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>