Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్సీబీ జోరు.. కోహ్లీకి ఆరెంజ్ క్యాప్!

కలం, స్పోర్ట్స్​ : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి, ఆరెంజ్ క్యాప్‌ను (Orange Cap) సొంతం చేసుకున్నారు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో తన ఐపీఎల్ కెరీర్‌లోనే తొలిసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడం గమనార్హం.

మోకాలి గాయం, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన గత రెండు మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్ చేయలేదు. అయినప్పటికీ, బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తూ ఆరెంజ్ క్యాప్ సాధించడంతో సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు నమోదు చేసిన బెంగళూరు.. 1.503 నెట్ రన్ రేట్‌తో టేబుల్ టాపర్‌గా నిలిచింది. లీగ్ ఆరంభంలోనే కోహ్లీ (Virat Kohli) ఫామ్‌లోకి రావడం, జట్టు పటిష్ట స్థితిలో ఉండటం ఆర్సీబీ శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతోంది.

Read Also: ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఆర్సీబీ ఏం చేయాలంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>