చెత్తకుప్పల్లో పడేయకండి.. ‘ఊయల’లో ఉంచండి!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నవజాత శిశువులను రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెత్తకుప్పలు లాంటి ప్రాంతాల్లో వదిలివేయకుండా ఊయలలో వేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక విజ్ఞప్తి చేశారు. నారాయణపేట (Narayanpet) ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఊయల కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వదిలివేసిన శిశువుల ప్రాణాలను కాపాడి, సంరక్షణ కల్పించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఒకవైపు కొంతమంది నవజాత శిశువులను అనాథలుగా వదిలివేస్తుండగా, మరోవైపు సంతానం లేని దంపతులు దత్తత కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉందన్నారు.

ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని శిశువును పెంచుకునే అవకాశం లేని తల్లిదండ్రులు ఎలాంటి భయం లేకుండా ‘ఊయల’లో వదిలి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ సూపర్ఇంటెండెంట్ సంపత్ కుమార్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆదిత్య, డీఎంహెచ్‌ఓ జయచంద్ర మోహన్, డీసీపీవో కరిష్మా, ప్రొఫెసర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: వాళ్లది వ్యూహమా.. మౌనమా..?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>