‘ధోనీ టీమ్ కంటే గిల్ జట్టులోనే ఎక్కువ సత్తా’

కలం, వెబ్ డెస్క్ : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని 2015 ప్రపంచ కప్ జట్టు కంటే, ప్రస్తుతం శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని వన్డే జట్టులోనే ఎక్కువ పటిష్టం, మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఉన్నాయని వ్యాఖ్యానించారు. 2015 వరల్డ్ కప్ సమయంలో తమ జట్టులో అనుభవం తక్కువగా ఉండిందని కోహ్లీ పేర్కొన్నారు. ఆ సమయంలో ధోనీ, రోహిత్, ధావన్, తాను ఉన్నప్పటికీ ఒంటిచేత్తో విజయాన్ని అందించే నమ్మకం అందరిపై ఉండేది కాదన్నారు. కానీ నేటి గిల్ జట్టులో నలుగురు వికెట్లు పడినా ఏ ఒక్కరైనా జట్టును గెలిపించగలరని చెప్పారు.

అలాగే 2015 సెమీస్ ఓటమి కంటే, 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమి తనను తీవ్రంగా కలిచివేసిందని కోహ్లీ వెల్లడించారు. ఆ ఓటమి తర్వాత మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, ఆ బాధ నుంచి కోలుకోవడానికి నెలల సమయం పట్టిందని చెప్పారు. ఆనాటి చేదు అనుభవాల నుంచే నేర్చుకున్న విషయాలతో ఇప్పుడు గిల్ నాయకత్వానికి మార్గదర్శకత్వం వహిస్తున్నట్లు కోహ్లీ వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>