కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో భక్తిశ్రద్ధలతో కొనసాగిన గణేష్ నిమజ్జన (Ganesh Immersion) మహోత్సవం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ప్రారంభమైన నిమజ్జన శోభాయాత్ర మూడు రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగింది. చివరి వినాయకుడి నిమజ్జనంతో ఉత్సవాలకు ఘన ముగింపు పలికింది.
బంగల్‌పేట్‌కు చెందిన 52వ నంబర్ వినాయకుడిని ఆదివారం ఉదయం వినాయకసాగర్ చెరువులో నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై.. బై బై గణేశా.. అంటూ భక్తులు నినదిస్తుండగా విఘ్నేశ్వరుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి వినాయకుడి నిమజ్జనంతో నిర్మల్ పట్టణంలో గణేష్ ఉత్సవాల సందడి ముగిసింది.
భక్తులు భావోద్వేగంతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా స్వాగతిస్తామంటూ ఆకాంక్షించారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

