కలం, జగిత్యాల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి (Kondagattu Temple) వారిని సినీ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు వరుణ్ తేజ్‌కు వేదాశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనా రెడ్డి, సూపరింటెండెంట్ సునీల్ కుమార్, ఆలయ అర్చకులు చిరంజీవి, మారుతి తదితరులు పాల్గొన్నారు.
Also Read : బిగ్‌బాస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్: కంటిస్టెంట్ కీలక నిర్ణయం!
Follow Us On : WhatsApp

