కలం, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore) జిల్లాకు చెందిన పలువురు టీడీపీ (TDP) నేతల అసభ్య నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిల్లకూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు ఓ ఇంట్లో యువతితో అశ్లీల నృత్యాలు చేశారు. ఈ వీడియోల్లో తమ్మినపట్టణం కోదండ రామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్, బొల్లవోలు టీడీపీ నాయకుడు దువ్వూరు వినయ్ రెడ్డి, తూర్పు కనుపూరు చెందిన ఒబ్బాయి శివ కుమార్ ఉన్నారు. శివకుమార్ ముత్యాలమ్మ తల్లి ఆలయ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. వీరంతా వీడియోలో ఓ మహిళతో డ్యాన్స్ చేస్తున్నారు. టీడీపీలో పార్టీ పదవులతో పాటు, పవిత్ర ఆలయాలకు సంబంధించిన పదవుల్లో ఉంటూ అశ్లీల కార్యక్రమాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: ఇన్‌స్టా ప్రేమ విషాదాంతం : ఏలూరు జిల్లాలో జంట ఆత్మహత్య
Follow Us On: Instagram

