Mobile Popup Ad
Mobile Popup Ad

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌: వమోపరిమితి పెంచిన సర్కార్‌!

కలం, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ సర్కార్ (Telangana Govt) తీపి కబురు చెప్పింది. సర్కారు కొలువుకు ఏజ్ బార్ అయిపోతుందని యూత్‌లోని ఆందోళనను గమనంలోకి తీసుకుని పదేండ్ల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్లకు ఒక సంవత్సరం పాటు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడానికి గరిష్ట వయో పరిమితి 34 సంవత్సరాలు ఉండగా ఇక నుంచి అది పదేండ్లు పెరిగి 44 సంవత్సరాలు అవుతుంది. దీంతో 44 ఏండ్ల వయసున్న యువత కూడా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఈ ఫెసిలిటీ ఒక ఏడాది కాలానికి మాత్రమే వర్తిస్తుంది. తాజాగా సోమవారం ఈ ఉత్తర్వులు ఇవ్వడంతో వచ్చే ఏడాది మే నెల వరకు కొనసాగనున్నది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విషయంలో ఈ పదేండ్లకు అదనంగా మరో రెండేండ్ల ఏజ్ రిలాక్సేషన్ వర్తించనున్నది.

ప్రభుత్వ ఉద్యోగాల్లో గరిష్ట వయోపరిమితిని పెంచాలంటూ యువత నుంచి వచ్చిన రిక్వెస్టులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం (Telangana Govt) ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చీఫ్ సెక్రటరీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఈ ఏజ్ రిలాక్సేషన్ వెసులుబాటు యూనిఫాం సర్వీసులైన పోలీస్, ఎక్సయిజ్, ఫైర్ డిపార్టుమెంట్, జైళ్ల శాఖ, ఫారెస్ట్ తదితర విభాగాల్లోని పోస్టులకు వర్తించదు. ఇవన్నీ శారీరక ప్రమాణాలు, దేహదారుఢ్యంతో ముడిపడి ఉన్న ఉద్యోగాలైనందున ప్రభుత్వం వాటిని ఈ రిలాక్సేషన్ నుంచి మినహాయించింది.

Read Also: ఓటు ఇక్కడా.. అక్కడా? : ‘SIR’ తో డబుల్‌ ఓట్లకు చెక్ !

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>