అషు రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. వాయిస్ మెసేజ్ వైరల్

కలం, వెబ్ డెస్క్:  సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, నటి అషు రెడ్డి(Ashu Reddy)కు సంబంధించిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా అషు రెడ్డి  ఆడియో  క్లిప్‌ వైరల్ అవుతోంది. అషు రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 9 కోట్లు వసూలు చేసిందని ఎన్ఆర్ఐ ధర్మేంద్ర ఆరోపించిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ వివాదంపై అషు రెడ్డి తొలిసారిగా స్పందించారు.

ఆడియో క్లిప్‌లో ఏముంది?

‘మే వరకు నాకు టైం ఇస్తే 1.5 కోట్లు ఇస్తాను. ఆ డబ్బులు కూడా అకౌంట్‌ ద్వారా పంపిస్తా. లేదు కుదరదు.. అంటే పెద్దమనుషులతో సెటిల్ చేసుకుందాం.   నా తరఫున పెద్ద మనుషులుగా జ్ఞాపిక ఎంటర్‌టెయిన్ మెంట్ ఎండీ ప్రవీణ, వేణుస్వామి వస్తారు. నువ్వు ఎవర్ని పిలుచుకుంటావో నీ ఇష్టం. నీ మొహం కూడా చూడటానికి నేను ఇష్టపడటం లేదు. ఈ కేసులో నువ్వు ఇంట్లో వాళ్లను ఇన్వాల్వ్ చేయొద్దు.. మా ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇన్వాల్వ్ చేశావంటే నేనే రివర్స్ కేసు పెడతా‘ అంటూ అశు మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది.

మరి అశు ప్రతిపాదనకు ధర్మేంద్ర అంగీకరిస్తాడా? ఈ సమస్యను పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకొని డీల్ చేసుకుంటారా? లేదా అన్నది వేచి చూడాలి. మొత్తంగా అశు వ్యవహారం ఇటు సినిమా ఇండస్ట్రీలో, సాధారణ ప్రజల్లో సైతం చర్చనీయాంశంగా మారింది.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>