డ్రగ్స్ పై ‘ఈగల్’ పంజా

కలం, నిజామాబాద్ బ్యూరో: ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో గంజాయి, డ్రగ్స్ పై ఈగల్ (EAGLE Force) పంజా విసురుతోంది. ఏడాదిలో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఏడు టన్నుల గంజాయి సీజ్ చేసింది. తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయి, ఇతర డ్రగ్స్ రవాణా కట్టడిని నియంత్రిస్తుండగా సత్ఫలితాలు వస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గంజాయితో పాటు ప్రధానంగా కల్తీకల్లు తయారీకి వినియోగించే ఆల్ఫాజోలం సరఫరాపై ఈగల్ నిఘా పెట్టింది. నందిపేట్, ఆర్మూర్, ముప్కాల్, నిజామాబాద్ రూరల్, బోధన్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురిని అరెస్ట్ చేసింది.

హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా చేసే ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక వ్యూహాలతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇప్పటికే సుమారు 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. మరోవైపు మాదకద్రవ్యాల వ్యసనం బారి నుంచి తప్పించేందుకు ప్రత్యేకంగా పోలీసు శాఖ కౌన్సెలింగ్ ఇస్తోంది. డీ అడిక్షన్ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఇప్పటి వరకు 492 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, అందులో 192 కల్తీకల్లు, మత్తు పదార్థాల వాడకంతో కలిగే దుష్ప్రభావాలపైనే చేపట్టింది.

ప్లాన్ తో ముందుకెళ్తున్నాం..

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఏడాది కాలంలో వివిధ రాష్ట్రాలు, సరిహద్దుల్లో దాడులు నిర్వహించి ఏడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. గంజాయి, మత్తు పదార్థాల సమాచారాన్ని యాంటీ డ్రగ్ టోల్ ఫ్రీ నంబర్ 1908, వాట్సాప్ నంబర్ 8712671111కు చేర వేయొచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – ఆర్.గిరిధర్, ఈగల్ ఎస్పీ

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>