Mobile Popup Ad
Mobile Popup Ad

సంగారెడ్డి జిల్లాలో దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి

కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి నెలలో ఒకరోజు నిర్వహిస్తామని నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్ హామీ ఇచ్చారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్‌ను మంగళవారం స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అసోసియేషన్ ( స్కైటు ) రాష్ట్ర అధ్యక్షులు ఎం.డీ.షఫీ అహ్మద్ ఖాన్ నాయకత్వంలో ఎన్‌పిఆర్‌డీ ఇండియా జిల్లా అధ్యక్షులు మహేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పోచయ్య, ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

‘దివ్యాంగుల సమస్యలపై త్వరలోనే సమీక్ష..’

ఈ సందర్భంగా ఎం.డి. షఫీ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చినట్లు వివరించారు. గతంలో అమల్లో ఉన్న దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని, అలాగే జిల్లా స్థాయిలో ప్రత్యేక యాక్ట్ కమిటీని ఏర్పాటు చేసి దివ్యాంగుల సమస్యలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశామన్నారు. స్పందించిన కలెక్టర్ త్వరలోనే దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం చేపడుతామని హామీ ఇచ్చినట్లు వివరించారు. అలాగే సంఘాలు, జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహిస్తానని హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>