కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు ఆదాయపు పన్ను ఎగ్గొడుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ (Krishank) ఆరోపించారు. రూ.2.80 కోట్ల రుణం ఎప్పుడు తీర్చుతారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుముల కొండల్ రెడ్డికి 2023లోనే నోటీసులు పంపించిందన్నారు. రుణాలు కట్టలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి.. ఇప్పుడు రూ.50 వేల కోట్ల ఆస్తులను ఎలా సంపాదిస్తున్నారని ప్రశ్నించారు. 2025లో ఆదాయపు పన్ను ఎందుకు కట్టడం లేదని కమిషనర్ నోటీసులు ఇస్తే.. తనకు మెమరీ లాస్ అయిందని, అందుకే కట్టడం లేదని కోర్టుకు చెప్పారని పేర్కొన్నారు.
అనుముల కొండల్ రెడ్డి (Kondal Reddy) కొన్నాళ్లుగా మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కోర్టు డాక్యుమెంట్లో స్పష్టం చేశారన్నారు. మెమరీ లాస్ అయిన వ్యక్తికి రూ.200 కోట్ల విలువైన భూమిని ఆయన ఛైర్మన్గా ఉన్న టెస్సరాక్ట్ కంపెనీకి ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండల్ రెడ్డి బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బహిరంగ ప్రకటన చేస్తే.. ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
ఇళ్లు కూలగొడుతూ..
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆర్ఆర్ కార్పొరేషన్ పేరిట దందాలు చేస్తున్నారని క్రిశాంక్ (Krishank) ఆరోపించారు. ఆర్ఆర్ మాల్ నిర్మాణానికి నార్సింగిలో వంద ఫీట్ల రోడ్డులో ఉన్న చిన్న స్కూళ్లు, ఇళ్లను కూలగొడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కుమార్తె నగరంలో పలు చోట్ల స్కూల్స్ నిర్మిస్తున్నారని, ఆయన తమ్ముడు కొండల్ రెడ్డి రక్షణ శాఖ కంపెనీలు ఏర్పాటు, మరో తమ్ముడు అమెరికాలో స్వచ్ఛ బయో కంపెనీలు పెడుతున్నారని వివరించారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించకపోయినా.. ఆర్ఆర్ కార్పొరేషన్ పేరిట పెద్ద ఎత్తున భారీ భవనాలు నిర్మిస్తున్నారని ఆధారాలను బయటపెట్టారు. వీటిపై సీఎం రేవంత్ స్పందించాలని డిమాండ్ చేశారు.
Also Read : ఎమర్జెన్సీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

