అమ్మాప‌ల్లిలో రీ సర్వే.. అధికారుల పరిశీల‌న‌

కలం, జడ్చర్ల: అమ్మాపల్లి (Ammapalli) గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.ఎల్.బి. హరిప్రియ శుక్ర‌వారం ప‌రిశీలించారు. జడ్చర్ల మండల డిప్యూటీ తహసీల్దార్‌తో కూడా ఆమె వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మీనంబారం ఆలయం సమీపంలో నిర్వహిస్తున్న ఆలయ భూముల రీ-సర్వే పనుల వివ‌రాల‌ను ఆమె అడిగి తెలుసుకున్నారు. రీ-సర్వే ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా, నిర్దేశిత నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా సర్వే పనులు చేపట్టాలని సర్వే బృందానికి సూచించారు. అమ్మాపల్లి గ్రామంలో రీ-సర్వేకు సంబంధించిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>