Mobile Popup Ad
Mobile Popup Ad

ఓట‌మిపై స్పందించిన స్టాలిన్‌..!

క‌లం, వెబ్ డెస్క్:  సైతం ప్ర‌త్య‌ర్థి చేతిలో ఓడిపోయారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు, డీఎంకే (DMK) ఓట‌మిపై ఎంకే స్టాలిన్ (MK Stalin) స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలను చూశాన‌ని, అలాగే ఎన్నో ఓటములను కూడా ఎదుర్కొన్నాన‌ని స్టాలిన్ పేర్కొన్నారు. త‌న‌కు ఆశయాలు, సిద్ధాంతాలే ముఖ్యమ‌ని స్ప‌ష్టం చేశారు. కేవలం గెలుపు ఓటములు కోసం ప‌ని చేయ‌న‌ని వెల్ల‌డించారు. ఈ ఓట‌మితో కృంగిపోయేది లేద‌ని, డీఎంకే రాజకీయ ప్రయాణం ఏమాత్రం అలసట లేకుండా కొనసాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రజల కోసం అద్భుతమైన పాలక పక్షంగా పని చేసిన త‌న పార్టీ ఇకపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పని చేస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఎన్నిక‌ల్లో స్టాలిన్ ఓట‌మి పార్టీ నాయ‌కుల‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మ‌రో వైపు స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>