Mobile Popup Ad
Mobile Popup Ad

ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. స్పందించిన విజయశాంతి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలపై కాంగ్రెస్ నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) స్పందించారు. తెలంగాణ విద్యార్థుల జీవితాలతో ముడిపడిన రియంబర్స్ మెంట్ పై సుదీర్ఘంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రియంబెర్స్ మెంట్ బకాయిలు విడుదల చేసే ప్రభుత్వం.. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని స్కూళ్లలో సరైన సదుపాయాలను ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రియంబెర్స్ మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

ప్రైవేట్ కాలేజీలు ఫీజులు వసూలు చేయడంలో తప్పులేదు కానీ.. తమ ఫీజులు వసూలు చేయడంలో చూపే శ్రద్ధను కాలేజీల నిర్వహణలో తగిన ప్రమాణాలను పాటించడంలో కూడా చూపాలని కోరారు. కనీస ప్రమాణాలు పాటించని కాలేజీలపై విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చిందని.. దీని ఆధారంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం తాను శాసన మండలి సమావేశాలు జరిగిన సమయంలో ప్రస్తావించానని గుర్తు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>