కలం, వెబ్ డెస్క్ : మరణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా? సంబవిస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ, కొన్ని జాగ్రత్తల దాని నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, మనకేం అవుతుందో అనే నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలిగొంటుంది. అనుకోకుండా వచ్చిన ప్రమాదం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఘటనే బెంగళూరు (Bengaluru Bike Accident ) లో చోటుచేసుకుంది.
బైక్ వెళ్తున్న ఓ వాహనదారుడిపై ఒక్కసారి చెట్టుకొమ్మ విరిగి మీద పడుతుంది. రాజాజీనగర్ లో జరిగిన ఈ ప్రమాదంలో బైకర్ తలపై కొమ్మ పడి తీవ్రగాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, బాధితుడు హెల్మెట్ ధరించకపోవడం వల్లే భారీ ప్రమాదం జరిగినట్లు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటన తరువాత పోలీసులు హెల్మెట్ పెట్టుకోమని పదేపదే ఎందుకు చెబుతారో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హెల్మెట్ ధరించి ఉంటే బైకర్ కు ప్రమాదం తప్పి ఉండేదని స్పష్టం అవుతోంది.
-బెంగళూరు రాజాజీనగర్‌లో షాకింగ్ ఘటన
-బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై పడిన ఎండిన చెట్టు కొమ్మ!
-ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్
Horrific Accident in Bengaluru: Dried tree branch crushes 52-year-old rider on Ram Mandir Road!
#BengaluruAccident #CCTVFootage… pic.twitter.com/UDk5WbyCeF— Kalam Daily (@kalamtelugu) June 26, 2026

