కలం, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో ఈడీ సోదాలు పూర్తయ్యాక మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు వయసు పెరిగింది, చావుకు దగ్గరవుతున్నారు. జీవిత చరమాంకంలో మంచి పనులు చేయాలి. అసలు ఈడీ సోదాలు చేయాల్సింది చంద్రబాబు ఇంట్లో. ఆయన నెలకు రూ.5 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఏడాదికి రూ.6 వేల కోట్లు విదేశాల్లో దాచి పెడుతున్నారు. నా ఇంట్లో కనీసం రూ.6 లక్షలు ఉండొద్దా..? మా అమ్మ చికిత్స కోసం ఉంచుకున్నాం. చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు’ అని మండిపడ్డారు.
జులైలో పార్టీ పెడుతా..
తాను త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. జులైలో ప్రకటిస్తానని.. మీడియా రంగంలోకి కూడా రాబోతున్నట్లు వివరించారు. కాగా, విజయసాయరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయి.. ఈడీ తనిఖీల వేళ ఒక్కసారిగా చంద్రబాబుపై విరుచుకపడటంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.

