బిజెపి గూండాల్లారా.. తాట తీస్తాం: వెలిచాల రాజేందర్‌రావు ఫైర్!

కలం, కరీంనగర్ బ్యూరో : “బీజేపీ గూండాల్లారా.. కాంగ్రెస్ నేతల జోలికొస్తే తాట తీస్తాం. మా ఓపికను అలుసుగా తీసుకుంటే వీధుల్లో తిరగలేరు. తస్మాత్ జాగ్రత్త. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం. నరేంద్ర మోడీకి ఇక శంకర్‌గిరి మాన్యాలు తప్పవు” అంటూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు (Velichala Rajender Rao) బీజేపీ నాయకులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని, లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ నగరంలోని మూడో డివిజన్ తీగలగుట్టపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ కార్యకర్తలు కళ్లకు నల్ల గంతలు కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాజేందర్‌రావు (Velichala Rajender Rao) మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల సహనాన్ని బలహీనతగా భావించి బీజేపీ గుండాలు వరుసగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి దౌర్జన్యాలను సహించేది లేదని స్పష్టం చేశారు. లాఠీలతో బిజెపి గూండాలు దౌర్జన్యంగా దాడులకు దిగారని మండిపడ్డారు.

నీట్ ప్రశ్నపత్రం లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయారని, 2024లో జరిగిన ఘటనకు ఇప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని, 2026లోనూ అదే పరిస్థితి పునరావృతమైందని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కాంగ్రెస్ పార్టీ మూడో డివిజన్ అధ్యక్షుడు మూల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పద్మాకర్ రెడ్డి, ఆర్ష మల్లేశం, కాశెట్టి శ్రీనివాస్, ఎలగందుల సర్పంచ్ నిమ్మల అంజన్న, దుగ్గు మహేందర్  పాల్గొన్నారు.

Read Also: కేటీఆర్‌పై బ్యానర్‌‌పై విచిత్ర వాదన, పింకీస్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>